
సినిమాలు

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సహా ఏ సినిమా అయినా తమ థియేటర్లలో ప్రదర్శించాలంటే పర్సంటేజ్ విధానం అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సంటేజ్ ఇవ్వని సినిమాలను తెలంగాణలో ప్రదర్శించబోమని అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఇకపై అన్ని సినిమాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ది రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గ్రామంలో హీరోలా ఎదిగే ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్ కథగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌లో క్రీడలు, పోరాటం, సామాజిక ఘర్షణల సమ్మేళనం ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!