

భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మరియు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు బయలుదేరింది. వచ్చే నెల12 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది. వరల్డ్ కప్‌కు ముందు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా, అనంతరం వార్మప్ మ్యాచ్‌లు వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో జరగనున్నాయి.
ఈ వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్–బీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో పోటీపడనుంది. వచ్చే నెల 14 న పాకిస్తాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనున్నారు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ తదితరులు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!