

జియో స్టార్ అత్యంత విజయవంతమైన ఫ్యామిలీ కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 3ను అధికారికంగా ప్రకటించింది. మొదటి రెండు సీజన్లలో హాస్యం, రిలేషన్షిప్ డ్రామా, చురుకైన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌కు మూడో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సీజన్‌కు శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త పాత్రలు, కొత్త ట్విస్టులతో మరింత ఎంటర్టైన్మెంట్ అందించనుంది.
తాజాగా విడుదలైన పోస్టర్లో “కాస్మిక్ ట్విస్ట్” అనే కొత్త కాన్సెప్ట్‌ను సూచిస్తున్నారు. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య జరిగే సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌తో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది. మూడు జంటల చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ టచ్ జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రియదర్శి, జబర్దస్త్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటులు తిరిగి కనిపించనుండగా, వెన్నెల కిషోర్ ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా చేరి కామెడీని మరింత పెంచనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!