

విభిన్న సమూహాల మధ్య సంఘర్షణలు, పోరాటాలు, ఊహించని పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వేట్టువం’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఆర్య, వీఆర్ దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా. రంజిత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘వేట్టువం’ను రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘వరల్డ్ ఆఫ్ వేట్టువం’ వీడియోకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ వీడియోలో సినిమా నేపథ్యంతో పాటు ప్రధాన పాత్రల స్వభావాలను పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సరికొత్త సినీ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!