
జనరల్

అమెరికాలో హాలోవీన్ వేడుకల సందర్భంగా కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. డాలస్‌లో చోటుచేసుకున్న వేర్వేరు కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి బర్మింగ్‌హామ్, డెలావర్, ఆర్కాన్సాస్ ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
ఈ ఘటనలకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు డాలస్ పోలీస్ చీఫ్ డానియెల్ వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు, ఘటనల వెనుక ఉన్నవారి వివరాలపై పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!