

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న రెండో సినిమాను తాత్కాలికంగా RC 17గా పిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని ఘనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. తాజాగా చిత్ర బృందం సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ స్టైలిష్ పోర్ట్రెయిట్‌ను నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల విస్తృతమైన బ్రష్ స్ట్రోక్స్‌తో రూపొందించారు. నెమలి పింఛాన్ని తలపించే ఈ ప్రత్యేకమైన ఆర్ట్‌వర్క్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా కథ, నేపథ్యంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
“మీరు ఊహించగలరు.. కానీ అందరి అంచనాలకు మించి ఉంటుంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో చిత్ర బృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ప్రీ-లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరగగా, షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!