2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

Writer: Shivani K 06:43 AM, 2 నవంబర్, 2026
ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

బీజేపీ ఓట్లను చోరీ చేయదని, ప్రజల మనసులను గెలుచుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని శిమ్లాలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాన్ని పారదోలండి’ అనే నినాదంతో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే కాకుండా, ఇటీవల బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహించిన పలు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ద్వారానే హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అదే ఎన్నికల విధానాన్ని ప్రశ్నిస్తూ నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, బీజేపీ విజయం సాధించినప్పుడే ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తున్నారని హిమంత ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు కచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని పేర్కొన్నారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు బంగ్లాదేశ్‌, నేపాల్‌లోని రాజకీయ పరిణామాలను కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని విమర్శించారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయ బెదిరింపులు లేదా వీధి ఆందోళనల ద్వారా కాకుండా ప్రజల ఓట్లతోనే మారుతాయని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఐదేళ్లలో యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

ట్యాగ్లు
హిమంత బిశ్వ శర్మబీజేపీకాంగ్రెస్రాహుల్‌ గాంధీఈవీఎంలుఎన్నికల సంఘంహిమాచల్‌ప్రదేశ్‌శిమ్లాఓటరు జాబితాలురాజకీయ విమర్శలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ
జనరల్

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!