

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. డీజిల్, ఎరువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కల్పించేందుకు రాబోయే కొన్ని వారాల్లో 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో అధిక ఇంధన ధరల కారణంగా నష్టపోయిన రైతులకు 8 బిలియన్ డాలర్ల ప్రత్యేక చెల్లింపులు చేయనున్నారు. పెరిగిన ఉత్పత్తి వ్యయాల భారాన్ని తగ్గించి, వ్యవసాయ రంగానికి మద్దతు అందించడమే ఈ ప్యాకేజీ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్యాకేజీలో పశుపోషకులు, మత్స్యకారులకు హామీతో కూడిన రుణాలు, ఎరువుల తయారీ ప్రాజెక్టులు, సాగు సంరక్షణ కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయించారు. అయితే పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, దిగుమతి సుంకాల (టారిఫ్‌ల) భారాన్ని ఈ తాత్కాలిక ఆర్థిక సాయం పూర్తిగా తగ్గించలేదని కొందరు నిపుణులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ప్యాకేజీ దీర్ఘకాలిక పరిష్కారం కాదని వారు పేర్కొంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!