
సినిమాలు

హాలీవుడ్ స్టార్ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్ 2026 హాలోవీన్ వేడుకల్లో అభిమానులకు వినూత్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న ఈ ఇద్దరు నటులు, తమ మార్వెల్ పాత్రల గెటప్‌లను పరస్పరం మార్చుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాబర్ట్ డౌనీ జూనియర్ మిస్టర్ ఫెంటాస్టిక్ వేషంలో కనిపించగా, పెడ్రో పాస్కల్ డాక్టర్ డూమ్ గెటప్‌లో సందడి చేశారు. అంతేకాకుండా, వీధుల్లో అభిమానులతో కలిసి సాధారణ వ్యక్తుల్లా ట్రిక్-ఆర్-ట్రీటింగ్ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. వీరి వినూత్న హాలోవీన్ వేడుకలతో రాబోయే మార్వెల్ చిత్రం అవెంజర్స్: డూమ్స్‌డేపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!