

స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన చౌరీ చౌరా ఘటనలో మరణశిక్ష పడిన వారిని కాపాడటంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విఫలమయ్యారని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఆదివారం చౌరీ చౌరా నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరసనకారులు పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టి పలువురు పోలీసుల మరణానికి కారణమైన ఘటనలో బ్రిటిష్ ప్రభుత్వం 172 మందికి మరణశిక్ష విధించిందని గుర్తుచేశారు. నెహ్రూ గొప్ప న్యాయవాది అని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారని, అయితే మరణశిక్ష పడిన వారిని కాపాడేందుకు ఆయన ముందుకు రాలేదని యోగి ఆరోపించారు.
మదన్ మోహన్ మాలవీయ న్యాయపరమైన వాదనలతో 151 మందిని ఉరిశిక్ష నుంచి కాపాడారని యోగి పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందని తెలిపారు. చౌరీ చౌరాలో ప్రాణత్యాగం చేసిన వీరులు భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆ ఘటన అప్పటి కాంగ్రెస్ నాయకత్వంపైనా ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!