
జనరల్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఓ హారర్ సినిమా తెరకెక్కనుంది. ‘స్కేరీ పిక్చర్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు రవిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో రవిబాబు హిందీ చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టనున్నారు.
శనివారం నిర్వహించిన హారర్‌కాన్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అయితే సినిమా కథ, ఇతర నటీనటులు, చిత్రీకరణ, విడుదల తేదీ వంటి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా ఇటీవల మనోజ్ తపాడియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంలో కనిపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!