
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక భారీ ఇంట్రో సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాటకు సంగీతాన్ని రవి బస్రూర్ అందించగా, ఇది పూర్తి స్థాయి మాస్ డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
ఈ పాటలో ఎన్టీఆర్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. రాజు సుందరం ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించనుండగా, శ్రీలంకలో ఈ పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!