
రాజకీయాలు

నితిన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త చిత్రం సాంప్రదాయ పూజ కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయవంతమైన చిత్రాలను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అనిత్ మదాడి ఛాయాగ్రాహకుడిగా, జానీ షేక్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!