

నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఎస్‌వీసీ సంస్థ రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఈ హక్కులను సొంతం చేసుకుంది. నాని నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు, గతంలో ఆ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు మంచి ఫలితాలు సాధించడం డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రాంత హక్కులను కూడా ఇదే తరహా ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఉత్తరాంధ్ర హక్కులను ఎస్‌వీసీ సంస్థ రూ.2.5 కోట్లకు దక్కించుకుంది.
ఆసక్తికరంగా ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రంతో కలిసి థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలను నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎస్‌వీసీ సంస్థే పంపిణీ చేయనుంది. విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ పూర్తవడంతో నితిన్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఒకే సంస్థ కీలక ప్రాంతాల్లో రెండు సినిమాలను ఒకేసారి పంపిణీ చేయనుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!