

సంక్రాంతి 2027 బరిలో నిలవనున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ‘జనవరి 12 విడుదల’ ఒకటి. వెంకటేశ్, కీర్తి సురేశ్, కల్యాణ్‌రామ్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ వినూత్న ప్రచారానికి తెరతీశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘దళపతి’ సినిమాలోని ఓ ఐకానిక్ సన్నివేశాన్ని అనిల్ రావిపూడి, కృతిశెట్టి సరదాగా రీక్రియేట్ చేశారు. ఈ వీడియోతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌పై ఆసక్తి పెంచారు.
రేపటి నుంచి ఈ సినిమా పాటల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో సంక్రాంతి 2027కు విడుదల కానున్న చిత్రాల్లో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతున్న తొలి సినిమాగా ఇది నిలవనుంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!