

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రంలో మరికొంత మంది నటీనటులు చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కథలో భావోద్వేగాలకు బలమైన ప్రాధాన్యం ఉండటంతో కీలక పాత్రల కోసం ప్రత్యేక ఎంపిక జరుగుతోందని టాక్. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ కలగలిపిన కథతో దర్శకుడు అట్లీ మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్‌గా కూడా కొత్త అనుభూతిని అందించనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే దీపికా పడుకొణె హీరోయిన్ కాగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ భామల పేర్లు ప్రచారంలో ఉండగా, కన్నడ నటుడు గణేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఫెమినా జార్జ్ కూడా చిత్రబృందంలో చేరినట్లు సమాచారం. ఇంకా ఓ యువ కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే కథలో అల్లు అర్జున్ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విదేశీ సాంకేతిక నిపుణులు పని చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!