

అన్షు, వాసవి గణేశన్ జంటగా బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషార్ పిట్టలు’. రుద్రక్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు థియేటర్లలో విడుదల చేస్తున్నాయి. టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొంది.
తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం సినిమాపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. విడుదలకు మూడు రోజుల ముందే పలు నగరాల్లో ప్రీమియర్లు ప్రదర్శించగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. ప్రేమ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యుక్తవయసులో తీసుకునే నిర్ణయాలు, చెడు స్నేహాలు, ఫోన్ల ప్రభావం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు మేకర్స్ తెలిపారు. పదో తరగతి తర్వాత ప్రేమలో పడే రవి, చిట్టిల జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు కథకు ప్రధానంగా నిలుస్తాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!