

టాలీవుడ్లో ఇప్పుడు స్పష్టంగా కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లకు బదులుగా స్టార్ హీరోలు ఇప్పుడు భావోద్వేగాలతో నిండిన కథలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కమర్షియల్ ఫార్ములాల కంటే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన ఎమోషనల్ డ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ మార్పు రాబోయే భారీ సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా158 తండ్రి–కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోందని సమాచారం. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే112 మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామాగా తెరకెక్కుతోంది. రవితేజ నటిస్తున్న ఇరుముడి కూడా ఎమోషనల్ రైడ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక సూర్య వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌పై ఆధారపడిన కథగా చెబుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!