
టెక్నాలజీ

ఒడిశా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, వేద్విక సోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అంతర్యామి’ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. దర్శకుడు శివ సత్యం తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానరంజన్ సాహు నిర్మాతగా, అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ అందించగా, జీజే కార్తికేయన్ సంగీతం సమకూరుస్తున్నారు. అశోక్ బోయిన ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. విభిన్నమైన కథ, ఆకట్టుకునే కథనం, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!