

టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మరోసారి వివాదం చర్చనీయాంశంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘జెట్‌లీ’ సినిమాను మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించకుండా నిలిపివేయడం పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంపై మైత్రీ సంస్థ ప్రతినిధి శశిధర్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను మల్టీప్లెక్స్‌లపై ప్రభావితం చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మల్టీప్లెక్స్‌లతో ఎలాంటి విభేదాలు లేవని, కేవలం ఒత్తిడి తేవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమస్యలను చర్చల ద్వారా పారదర్శకంగా పరిష్కరించుకోవాలని మైత్రీ సంస్థ సూచించింది. ఇలాంటి వివాదాలు కొనసాగితే సినిమా వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గమనిక: ఈ వివాదంపై అధికారిక స్పందనలు, తదుపరి నిర్ణయాలు వెలువడాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!