

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి తమ నిర్మాణ సంస్థకు పలువురు నటీనటులు, దర్శకులతో ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చని సందర్భాలు ఎదురయ్యాయని తెలిపారు. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్తీ కోసం దర్శకుడు శివ ఒక కథ చెప్పారని, అయితే ఆ ప్రాజెక్ట్ జరగలేదని వెల్లడించారు. అలాగే ఎస్‌జే సూర్యను గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో భాగం చేయాలని అనుకున్నామని, కానీ ఆ కాంబినేషన్ కూడా కుదరలేదని చెప్పారు.
విజయ్ దేవరకొండతో మాళవిక మోహనన్ నటించిన రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కాల్సిన సినిమాలో ఆమె తమతో కలిసి పనిచేశారని, అయితే ఆ సినిమా కూడా ఆగిపోయిందని రవి తెలిపారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుకు మైత్రి మూవీ మేకర్స్ తరఫున అడ్వాన్స్ ఇచ్చామని కూడా గుర్తుచేశారు. ఇలా పలువురు నటులు, దర్శకులతో అనుకున్న ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడాన్ని ప్రస్తావిస్తూ “ఇక్కడ అందరితో మాకు బ్యాడ్ లక్” అని రవి వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!