

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదల సమయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ‘సావేజ్ ఓత్’ పేరుతో రూపొందిన టీజర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.
‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను టీ-సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన విలన్‌గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలంలోని 1854 నుంచి 1878 మధ్య జరిగిన కొన్ని అసాధారణ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!