

ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన సొంత బ్యానర్ ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ను ప్రారంభించి నిర్మాతగా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా ఆమె తొలి ప్రాజెక్ట్‌గా ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌ను ప్రకటించారు. జీ5 తెలుగు భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ పక్కా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సాధారణంగా నేరం లేదా మరణం వెనుక ఉన్న ఆధారాలను నమోదు చేసే పోలీసుల న్యాయపరమైన ప్రక్రియను ‘పంచనామా’ అంటారు. ఇదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రా అండ్ ఇంటెన్స్ కథతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. భరత్ నివాస్, సూర్య శ్రీనివాస్ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
తన నిర్మాత ప్రస్థానాన్ని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రారంభించడంపై ఉదయభాను ఆసక్తి వ్యక్తం చేశారు. కథపై పూర్తి నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువ నటీనటులు, సాంకేతిక నిపుణులకు తన బ్యానర్ ద్వారా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశాన్ని కూడా ఆమె వెల్లడించారు. ‘పంచనామా’ త్వరలో జీ5 తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఉదయభాను మేకింగ్ విజన్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌పై ఓటీటీ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!