
జనరల్

‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్న సినిమా ప్రమోషన్‌లో సందీప్ రెడ్డి వంగా పాల్గొనడం మరింత హైప్‌ను తీసుకొచ్చింది. దీంతో ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు జరుగుతున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సందీప్ రెడ్డి వంగా రానుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!