

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్‌కు ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. ఆమెను కలిసేందుకు వచ్చిన ముగ్గురు యువతులు సెల్ఫీలు తీసుకోవడంతో పాటు, ఆమె నటన తమ జీవితాలపై చూపిన ప్రభావాన్ని వివరించారు. అభిమానుల ప్రేమకు అవికా ఆనందం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు యూరోపియన్లు ఆ హడావుడిని చూసి అవికాపై ఏదైనా దాడి జరుగుతోందేమోనని ఆందోళన చెందారు.
ఈ ఘటనను అవికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సరదాగా పంచుకున్నారు. చిన్న వయసు నుంచే అభిమానులు తనతో ఫొటోలు దిగుతున్నప్పటికీ, ఈ ముగ్గురు యువతులు తన కళ పట్ల చూపిన గౌరవం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. నటులుగా తాము కష్టపడటానికి ఇలాంటి ప్రేమ, గుర్తింపే కారణమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అవికా గోర్ ఇటీవల స్టంట్ ఆధారిత రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీతో జరిగిన స్టంట్‌లో ఓడిపోవడంతో ఆమె షో నుంచి నిష్క్రమించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!