

మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై ఆనందం వ్యక్తం చేశారు. మోదీతో చరణ్ కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్న చిరంజీవి, సుమతీ శతకంలోని పద్యాన్ని ప్రస్తావిస్తూ, పుత్రుడు జన్మించినప్పుడు కాకుండా, సమాజం అతన్ని ప్రశంసించినప్పుడు తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని పేర్కొన్నారు. రిపబ్లిక్ సమిట్‌లో మోదీ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్”గా సంబోధించడం తనకు గర్వంగా అనిపించిందని తెలిపారు.
ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గౌరవం తనకు తండ్రిగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చిరంజీవి అన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చరణ్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆయన కోరుకున్నారు. ఇటీవల జరిగిన ‘పెద్ది’ విజయోత్సవ వేడుకలో కూడా చిరంజీవి చరణ్‌పై ప్రశంసలు కురిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!