

ఒకప్పుడు టాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్, ఇటీవలి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తన నటనను నిరూపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తన అసలు స్టైల్ అయిన కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లరి నరేష్ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో మరోసారి నవ్వుల వర్షం కురిపించనున్నాడని ఆశిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!