

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్‌గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దూకుడు’ ఈ ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. తాజాగా ‘గురువారం మార్చి ఒకటి’ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను వెల్లడించారు. షూటింగ్ ఒక వైపు జరుగుతుండగా, తాను రోడ్డుకు అవతల వైపు ఉన్న లేక్ దగ్గర నిలబడి తదుపరి సన్నివేశంపై ఆలోచిస్తున్నానని తెలిపారు.
ఆ సమయంలో మహేష్ బాబు తనతో మాట్లాడేందుకు రోడ్డుపైకి దిగగా, ఒక్కసారిగా ఓ బస్సు అతని దగ్గరగా వచ్చిందని, వెంటనే మహేష్ తన కాలును వెనక్కి తీసుకున్నారని చెప్పారు. తర్వాత తన వద్దకు వచ్చిన మహేష్ విషయం చెప్పగా తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఆ సంఘటనను అప్పట్లో ఎవరికీ చెప్పలేదని, చెప్పితే భయపడతారని భావించి దాచుకున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఎవరితోనూ పంచుకోని ఈ విషయాన్ని ఇప్పుడు తొలిసారి బయటపెడుతున్నానని శ్రీను వైట్ల వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!