

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవుతున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య కథనాలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసి, తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టింది.
ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఆ చిత్ర టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న విడుదల చేయనున్నారు. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని నాని నిర్మించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!