

బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌పై డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అంటూ వచ్చిన ఆరోపణలను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఖండించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సుస్మిత కష్టపడి ఎదిగిన స్వతంత్ర మహిళ అని పేర్కొన్నారు. ఆమె వద్ద విలువైన వజ్రాలు ఉండటమే కాకుండా డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయని, ఇవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకున్నవేనని తెలిపారు. తమ ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో బయట ఖర్చులన్నీ ఎక్కువగా సుస్మితానే భరించేదని, తానే ఆమెపై ఆధారపడ్డానని చెప్పారు. డబ్బు కోసం ఆమె ఎవరినీ ఆశించదని, ఆమె గురించి తెలియనివాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తారని స్పష్టం చేశారు.
తమ బంధం గురించి మాట్లాడుతూ, సుస్మిత తన జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని లలిత్ మోదీ తెలిపారు. తన ఎదుగుదలకు ఆమె ఎంతో సహాయం చేసిందని, తమ బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో దేశం విడిచి 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్న లలిత్ మోదీ, 2022లో సుస్మితా సేన్‌తో తన సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!