

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు విభిన్నమైన వినోదం అందుబాటులోకి రానుంది. యాక్షన్, హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ, డాక్యుమెంటరీ వంటి పలు జానర్లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన ధురందర్ 2: ది రివెంజ్ జూన్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా, ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పేట్రియాట్ జూన్ 5 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.
మరోవైపు ఒబ్సెషన్, కేడీ: ది డెవిల్, మా బెహెన్, ఆఫీస్ రొమాన్స్ వంటి చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీ వేదికలపై సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, థ్రిల్లర్‌ల నుంచి రొమాంటిక్ కామెడీల వరకు అన్ని రకాల ప్రేక్షకుల కోసం ఈ వారం భారీ లైనప్ సిద్ధమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!