
జనరల్

భారత టేబుల్ టెన్నిస్ యువ సంచలనం 15 ఏళ్ల దివ్యాన్షి భోమిక్ అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ రెండు విభాగాల్లోనూ టైటిళ్లు గెలుచుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 211వ స్థానంలో ఉన్న దివ్యాన్షి, ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన 38వ ర్యాంకర్ యెహ్ యి తియాన్‌ను 3–2 తేడాతో ఓడించింది.
డబుల్స్‌లో దివ్యాన్షి తన సహచర టీనేజర్ సిండ్రెలా దాస్‌తో కలిసి జపాన్ జోడీ సచి అయోకి – కొకోనా మురమతుపై 3–2తో విజయం సాధించింది. ఈ విజయంతో దివ్యాన్షి భారత టేబుల్ టెన్నిస్‌లో కొత్త చరిత్ర రాసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!