
సినిమాలు

ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు ప్రస్తుతం తగినంతగా ఉన్నాయని, ఇది రైతులకు తాత్కాలిక ఊరట కలిగించే అంశమని ఆయన తెలిపారు.
అయితే దీర్ఘకాలంలో పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశం యూరియా కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడటం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల సబ్సిడీల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ధరల రాయితీల విధానానికి బదులుగా రైతులకు నేరుగా ఆదాయ సహాయం అందించే విధాన సంస్కరణలు అవసరమని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!