
జనరల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారిగా నిర్వహించనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. తొలుత 2027 జూన్-జూలైలో ఈ టోర్నీని నిర్వహించాలని భావించిన ఐసీసీ, తాజా నిర్ణయంతో టోర్నీని 2027 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో జై షా అధ్యక్షతన జరిగిన త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మెగా టోర్నీని 10 జట్లతో నిర్వహించనున్నారు. ఐదు పూర్తిస్థాయి సభ్య దేశాలు, ఐదు అసోసియేట్ దేశాలు పాల్గొనే ఈ టోర్నీ తొలి ఎడిషన్‌గా నిలవనుంది. ఇతర అంతర్జాతీయ సిరీస్‌లు, మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలో టోర్నీ నిర్వహించడం ఉత్తమమని ఐసీసీ నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!