

మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణంలో తొలి అడుగు వేసిన రోజు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. “పునాదిరాళ్లు” సినిమా కోసం కెమెరా ముందు తొలిసారి నిలిచిన ఆ అనుభూతి ఇప్పటికీ మదిలో తాజాగా ఉందని ఆయన తెలిపారు. ఆ రోజున తనలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగాలు మాటల్లో చెప్పలేనివని పేర్కొన్నారు. ఆ క్షణం నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తోందని, అది ఒక అందమైన చందమామ కథలా మధురంగా గుర్తుంటుందని భావోద్వేగంగా వెల్లడించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ప్రోత్సాహం తన నటనా ప్రయాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులే తన విజయానికి మూలం అని మెగాస్టార్ పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!