

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తన స్వంత బ్యానర్ ఆర్కే ఫిలింస్ పై నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “మహిళా కబడ్డీ”. ఈ చిత్రంలో నిజమైన కబడ్డీ ఆటగాళ్లు నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, కోచ్ శ్రీనివాస్ రెడ్డి, నటులు సుమన్, అక్సాఖాన్, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
.jpeg)
హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం వివరాలు తెలియజేసింది. ఈ సందర్భంగా కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కబడ్డీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పెరుగుతోందని, మహిళల ప్రో కబడ్డీ లీగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. పూజ నర్వాల్ మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచే కబడ్డీపై ఆసక్తితో ఎదిగానని, ఈ సినిమా మహిళలకు ప్రేరణనిచ్చేలా ఉంటుందని అన్నారు.
దర్శక నిర్మాత డా. ఆర్కే గౌడ్ మాట్లాడుతూ, ఒక పేద గ్రామీణ బాలిక కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరిందనే కథాంశంతో “మహిళా కబడ్డీ” రూపొందిస్తున్నామని తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమన్ తండ్రి పాత్రలో, అక్సాఖాన్ కబడ్డీ ప్లేయర్గా కనిపించనున్నారు. మంగ్లీ, మధుప్రియ పాడిన పాటలు ఇప్పటికే రికార్డయ్యాయని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సినిమా కబడ్డీ ఆడే యువతులకు స్ఫూర్తినిచ్చేలా ఉండబోతోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!