

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కించిన ధ్రువనక్షత్రం సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భావోద్వేగ పోస్టులో సినిమా అనేది వందలమంది కృషి ఫలితమని పేర్కొంటూ, తన కెరీర్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన న్యాయవాది అబ్దుల్ హమీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ నటించగా, హీరోయిన్గా రీతూ వర్మ కనిపించనున్నారు. 2016లో ప్రారంభమైన ఈ సినిమా 2017లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 2023లో విడుదలకు సన్నాహాలు చేస్తుండగా, On In Pictures ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలతో కోర్టును ఆశ్రయించి విడుదలను ఆపాలని కోరింది. అయితే తాజా తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!