
సినిమాలు

భారతీయ సినీ చరిత్రలోని అరుదైన క్షణాలను ప్రతిబింబించే ‘లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్’ ఎగ్జిబిషన్ ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటి హేమ మాలిని ఆవిష్కరించారు. ధర్మేంద్ర మరియు ఆశా భోంస్లేలకు అంకితంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యూట్ వాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి.
వేదికపై మాట్లాడిన హేమ మాలిని, తన భర్త ధర్మేంద్రను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలు తనకు అమూల్యమని, ఆయన లేకపోవడం అంగీకరించడం కష్టమని చెప్పారు. అలాగే ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ గాత్రాలు తన పాత్రలకు ప్రాణం పోశాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!