

రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై, ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మిక సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి సీఎం తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం-కార్మికులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని సీఎం స్పష్టం చేశారు. 1000 ఈవీ బస్సుల కొనుగోలు, శంషాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణం, సేవల విస్తరణ వంటి చర్యలను ప్రకటించారు. డ్రైవర్ల ఉద్యోగాలు తగ్గించబోమని, బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. డీజిల్ ఖర్చు తగ్గింపు, అప్పుల భారం తగ్గింపు కోసం సంస్కరణలు చేపడుతున్నామని, సంస్థ భవిష్యత్తు కోసం రాజకీయాలకు దూరంగా కలిసి పనిచేయాలని కార్మిక సంఘాలకు సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!