
క్రీడలు

నటి మరియు సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం అక్రమ విక్రయాలపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని, మూగజీవాలపై జరుగుతున్న అమానుషత్వం సమాజం నైతిక విలువలు ఎంత దిగజారిపోయాయో చూపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మనం నివసిస్తున్న కాలం ఎంత భయంకరమో తెలియజేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మనుషులపైనా క్రూరమైన నేరాలు జరుగుతున్న సమయంలో, జంతువులపై కరుణ చూపుతారని ఎలా ఆశించగలమని ఆమె ప్రశ్నించారు. రక్తం అమ్మేవారికంటే కొనేవారికే ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొంటూ, మూలం తెలియకుండా కొనడం వల్ల అక్రమ దందాలకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ప్రతి తప్పుకు ఫలితం తప్పదని, కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన తప్పు తప్పక తిరిగి వస్తుందని ఆమె హెచ్చరించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!