
క్రీడలు

గుంటూరు పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో కుంచనపల్లిలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేతలు చర్చించారు.
ప్రభుత్వం 22 నెలల పాలనలోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై కూడా సమాలోచనలు జరిగాయి. ఈ సమావేశానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!