
క్రీడలు

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ మరియు అమెరికా మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి సయ్యద్ మెహ్దీ తబాతబాయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను “పిల్లల హంతకుడు”గా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వెంటనే నష్టపరిహారం చెల్లించి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం మాట్లాడుతూ, అమెరికా చౌకబారు మైండ్ గేమ్స్ ఆడుతోందని ఆరోపించిన ఆయన, ఇరాన్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని చెప్పారు. అయితే బలప్రయోగ భాషలో మాట్లాడితే కఠినమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. కాల్పుల విరమణకు ముందు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో పౌరులు మరణించారని ఇరాన్ ఆరోపిస్తూ, మినాబ్‌లోని పాఠశాలపై దాడిలో వందకు పైగా బాలికలు మృతి చెందినట్లు పేర్కొంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!