
జనరల్

ఎన్నికల సంఘం బుధవారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో జరిగిన అనుమానాస్పద ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్రాష్ట్రంలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్‌లో 4, మగ్రాహట్ పశ్చిమ్‌లో 11 బూత్‌లలో శనివారం తిరిగి పోలింగ్ జరుగనుంది.
పోలింగ్ సమయంలో కొన్ని బూత్‌లలో ఈవీఎం బటన్లను టేప్‌తో కప్పినట్లు బీజేపీ ఆరోపించింది. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయని పేర్కొంది. ఓటర్లు ‘కమలం’ గుర్తుకు ఓటేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఫల్తా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లలో కూడా రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!