
సినిమాలు

టాలీవుడ్లో మరో కొత్త సమస్య తలెత్తింది. నిర్మాతలు మరియు తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదిరింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని స్పష్టం చేస్తుండగా, గిల్డ్ నిర్మాతలు మాత్రం రెంటల్ సిస్టమ్‌లోనే విడుదలలు జరగాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం సినిమా విడుదలలపై ప్రభావం చూపుతూ పరిశ్రమలో అనిశ్చితిని సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో విడుదలైన “జెట్లీ” సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు ఏసియన్, సురేష్, గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఆధీనంలోని థియేటర్లలో, అలాగే ఏఎంబీ, ఏఏఏ వంటి మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించబడలేదు. ఈ విధానం సరైంది కాదని గిల్డ్ నిర్మాతలు అభిప్రాయపడుతూ, ఇది పంపిణీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!