
సినిమాలు

ఈ ఏడాదిలో సగానికి పైగా పూర్తవగా, విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేశాయి. విశేషంగా ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో మూడు తెలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం రూ.74.25 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగింది.
అయితే తాజాగా తలపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ తొలి రోజే రూ.81.05 కోట్ల వసూళ్లు సాధించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఐదో స్థానానికి చేరింది. ప్రస్తుతం ‘దురంధర్: ది రివేంజ్’ రూ.204 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, ‘పెద్ది’ రూ.117.20 కోట్లతో రెండో స్థానంలో, ‘ది రాజా సాబ్’ రూ.101.80 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!