

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ట్రెండ్‌ను గుడ్డిగా ఫాలో అయ్యే విధానంపై విమర్శలు చేశారు. ఒక సినిమా హిట్ అయిన వెంటనే నిర్మాతలు, దర్శకులు అదే తరహా కథలపై దృష్టి పెట్టడం సరికాదని అన్నారు. ప్రయోగాలకు దూరంగా వెళ్లి ఒకే రకమైన సినిమాలు చేయకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలని సూచించారు.
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమాను ఉదాహరణగా ప్రస్తావించిన కరీనా.. ఆ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత వయొలెన్స్ ఆధారిత కథల వైపు చాలామంది వెళ్లారని అన్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు చాలా తెలివైనవారని, ఏ సినిమా థియేటర్‌లో చూడాలో వారికి స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. ఒక సినిమా విజయాన్ని గుడ్డిగా అనుసరించి అదే ఫార్ములాను కాపీ చేస్తే ప్రేక్షకులు ఆదరించరని, మంచి కథ, బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకే వారు మద్దతు ఇస్తారని కరీనా స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!