

క్రేజీ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’. యువ నటులు అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రంలోని మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
‘హై రే’, ‘చిన్ని చిన్ని’ పాటల తర్వాత ‘ఇట్లు అర్జున’ నుంచి ‘ఎల్లో చున్నీ’ పేరుతో మూడో సింగిల్ విడుదల కానుంది. ఈ పాటను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తొలుత అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, విడుదలను వాయిదా వేసిన మేకర్స్ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!