

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమాన్వికి డెబ్యూట్ మూవీలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’లో ఆమె కథానాయికగా నటిస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టిన ఇమాన్వి.. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని ఆఫర్లను కూడా తిరస్కరించినట్లు సమాచారం. ప్రభాస్ వంటి స్టార్‌తో కలిసి నటించడం ద్వారా తనకు భారీ గుర్తింపు వస్తుందని ఆమె భావించినట్లు తెలుస్తోంది.
అయితే ‘ఫౌజీ’ విడుదల వాయిదా పడటంతో ఇమాన్వి డెబ్యూ మరింత ఆలస్యం కానుంది. డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించినప్పటికీ, క్వాలిటీకి సంబంధించిన కారణాలతో రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూడటం ఆమె కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందనే చర్చ మొదలైంది. భారీ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే గుర్తింపు ఆమె కెరీర్‌కు కొత్త దిశను ఇస్తుందా, లేక ఇతర అవకాశాలను కోల్పోయేలా చేస్తుందా అనేది ‘ఫౌజీ’ విడుదల తర్వాతే స్పష్టమవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!