

యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను విడుదల చేసింది. పాస్‌పోర్ట్‌ను పోలిన డిజైన్‌తో రూపొందించిన ఈ ఫోన్‌లో 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.4 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఏ20 ప్రో చిప్‌సెట్‌తో పనిచేసే ఈ డివైజ్‌కు గ్రేడ్-5 టైటానియం ఫ్రేమ్, సెరామిక్ షీల్డ్ రక్షణ కల్పించారు. దీని బరువు 254 గ్రాములు. ఫోన్ సైడ్ బటన్‌లోనే టచ్ ఐడీని అందించారు. రెండు స్క్రీన్లకు అనుగుణంగా ఐఓఎస్ 27లో ప్రత్యేక ఫీచర్లను రూపొందించారు.
ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ‘డ్యూయో ప్రివ్యూ’ ద్వారా ఫొటోలు తీసేటప్పుడు ఔటర్ డిస్‌ప్లేపై కెమెరా ప్రివ్యూను చూసుకోవచ్చు. చిన్నారులు కెమెరా వైపు చూసేలా ఆకర్షించేందుకు ‘కిడ్ క్యూ’ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందించారు. భారత్‌లో 256 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,99,900గా నిర్ణయించారు. అమెరికాలో దీని ప్రారంభ ధర 1,999 డాలర్లు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి యాపిల్ ప్రవేశించడంతో ఈ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న శాంసంగ్‌కు పోటీ పెరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!