

విశ్వంభర విడుదలపై నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో ముగింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ ఫాంటసీ విజువల్ డ్రామా నిర్మాణ సమస్యలు, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది.
ఈ భారీ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశిక రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై చూపించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి మరో సినిమా సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ను ఈ ఏడాదే విడుదల చేయాలని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడితే అభిమానుల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!